పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆ మోదం తీసుకోవటం ఆనందదాయక మని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం వలన లక్ష లాది మంది కాంట్రాక్టర్లు, పనులు చేసిన నిర్వాహకులకు న్యాయం జరుగు తుందని పేర్కొన్నారు. 2014 నుం చి 2019 వరకు చేసిన పనుల పెండింగ్ బిల్లులను వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో నిలిపి వేసిందని తెలిపారు. కాంట్రాక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో బిల్లులను నిలిపివేయటంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని వివరించారు.
