పేద వర్గాలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమమార్గంలో తరలిస్తుండగా విజిలెన్సు సీఐ ఎన్ రాఘవరావు ఆద్వర్యంలో లారీని ఆపి పరిశీలించగా 400 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న ఘటన గురువారం వేకువజామున బొద్దికూరపాడు వద్ద జరిగింది. అందిన సమాచారం మేరకు… కొందరు అక్రమార్కులు బొద్దికూరపాడు కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ఆగ్రామంలో నిల్వ వుంచిన రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా గురువారం వేకువ జామున లారీలో తరలిస్తున్నారు. గ్రామస్తులు కొందరు విజిలెన్సు అధికారులకు సమాచారం ఇవ్వటంతో విజిలెన్సు అధికారులు దారి లో నిఘా ఉంచారు. ఈ తరుణంలో బొద్దికూరపాడు నుండి చింతపాలెం వెళ్లే మార్గంలో లారీని ఆపి పరిశీలించారు. లారీలో కొన్ని బస్తాలు రేషన్ బస్తాల్లో సీల్ లతో వున్నాయి. కొంత బియ్యాన్ని తెల్లగొతాల్లో ధాన్యంలా నమ్మించేందుకు లారీలో ముందు వెనుక వేసి వున్నారు. తెల్లగోతాల్లో ధాన్యంలా నమ్మించేందుకు లారిలొ ముందు వెనుక వేసి వున్నారు. వాటిని లెక్కించగా 400 బస్తాలు 18,400కేజీ ల రేషన్ బియ్యం వున్నట్లు నిర్ధాంచారు. పట్టుబడ్డ రేషన్ బియ్యంవాహనాన్ని తాళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజిలెన్సు అధికారులు,ఎన్పోర్సుమెంట్ అధికారులు కేసునమోదు అనంతం ఆ బియ్యాన్ని చీమకుర్తి ఎమ్ఎల్ఎస్ పాయింట్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో విజిలెన్సు ఎస్సై జి. నాగేశ్వరరావు, ఎన్పోర్సుమెంట్ డిటీ వివిప్రసన్న. పీసీ మాగంటి సురేష్ తదిత రులు పాల్గొన్నారు.మండలంలో ఎన్నడూ లేని విధంగా 400 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడటం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
