ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు వారం ఆమె ర్యాలీ ప్రారంభించారు. నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రాకుండా 18 -ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఇంటి వద్దకు వచ్చే వైద్య బృందంతో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని ప్రథమ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించే సర్వేలో 18 ఏళ్లు దాటిన స్త్రీ పురుషులంతా తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. ఎన్డీసీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ భగీరథి, ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరావు, హెల్ప్ టీఐ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ సాగర్, ఫ్లోరోసిస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, నర్సింగ్ విద్యార్థినులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

