ఘనంగా మల్లేశ్వరస్వామి ప్రధమ వార్షికోత్సవం

తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ పరిధిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగ సన్మిధిలోని శ్రీపార్వతీ సమే తమల్లిఖార్జునస్వామి ప్రథమ వార్షికోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయపూజారి నడిపల్లి సాంబసదాశివప్రసాదరావు ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.కార్తీక మాసంలోని అత్యంత పర్వదినం, శివునికి ఇష్టమైన రోజు కోటిసో మారం రోజు వార్షికోత్సవం రావటంతో శివాలయాన్ని భక్తులు శివాలయాన్ని అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఆలయధర్మకర్త సన్నెబోయిన వీరాంజనే యులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లక్కవరం శివాలయంలో..

కార్తిక మాసకోటి సోమవారం సందర్భంగా లక్కవరం చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారి నడిపల్లి సాంబ సదా శివ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మహాన్యా సపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *