దర్శి పట్టణం లోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నివాసం లో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధ్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ప్రముఖ టిడిపి నాయకులు, నరసరావుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కడియాల రమేష్ బాబు జన్మదిన వేడుకలు టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధులు గా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు తెలుగుదేశం పార్టీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొని కేక్ కట్ చేసి కడియాల రమేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగినది.
కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గం లోని దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వర రావు, కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు పిడతల నేమిలయ్య, దొనకొండ, కురిచేడు దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

