వైసిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఆయన కుటుంబసభ్యులపై అనుచిత పోస్టులు పెట్టిన టిడిపి సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పి కార్యాలయంలో తాలూకా సిఐ అజయ్ కుమార్ కు వైసిపి నేతలు వినతిపత్రం అందజేశారు. వైసిపి నేతలు మాట్లాడుతూ …టిడిపిసోషల్ మీడియా నాయకులు మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమన్నారు. కుటుంబ సమస్యలను రాజకీయం చేయటం తగదన్నారు. అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, కొండపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్, మాజీ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైసిపి నేతలు పాల్గొన్నారు.

