ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తుందని దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తూర్పుగంగవరం- జమ్మల మడక రోడ్ లో బి. టి రోడ్ పనులను తూర్పు గంగవరం వద్ద ఆమె ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గోతుల మయంగా ఉన్న రోడ్డును పరిశీలించి మరమ్మత్తులకు తాను హామీ ఇచ్చానని చెప్పారు. అందుకు అనుగుణంగా నేడు పనులు పురోగతిలో ఉండడాన్ని ఆమె గుర్తు చేసారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డులు అన్ని గుంతల మయం అయి ప్రజలు వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడిన విషయాలను గుర్తు చేసారు.
కార్యక్రమంలో టిడిపి నియోజక వర్గ నాయకుడు కడియాల లలిత సాగర్, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఒబులు రెడ్డి, నాయకులు షేక్ పేద కాలేషా వలి (బడే), ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, వెంకట రావు, రామయ్య, గొల్లపూడి వేణుబాబు,కళ్యాణ్, ఎన్. ఆదినారాయణ రెడ్డి, రామ కోటి రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

