విధులకు డుమ్మాకొట్టిన11 మంది బియల్వోలపై చర్యచేపట్టాలని దర్శి ఈఆర్వో సిఫార్సు

ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా
విధులకు డుమ్మాకొట్టిన11 మంది బియల్వోలపై చర్యచేపట్టాలని దర్శినియోజకవర్గఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు ఆదివారం జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు శని, ఆదివారం ల లో బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రాలవద్ద అందుబాటులో వుండి ముసాదా ఓటర్ లిస్ట్ ను పబ్లిస్ చేయటం, స్పెషల్ క్యాంపెయిన్ రోజుల్లో ఓటర్ల ధరఖాస్తులను స్వీకరించాల్సి వుంది. మండలంలోని 11 మంది బియల్వోలు విధులకు హజరు కాలేదు. ఎన్నికల విధులకు హజరుకాని బియల్వోలపై తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దర్శిఎలక్ట్రోలజిస్ట్రేషన్ అధికారికి రిపోర్ట్ చేశారు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈఆర్వో జిల్లా కలెక్టర్ కు నివేధిక పంపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *