నర్సింగ్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే తలసాని…………………..

నర్సింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. కాలేజీలోని విద్యార్థులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఆయన సోమవారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ లో గల గాంధీ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని సందర్శించారు. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల సంఖ్య, సమస్యలపై అద్దికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 400 మంది నర్సింగ్ విద్యార్థులు ఉన్న కాలేజీలో నెలకొన్న సమస్యలపై పూర్తిస్థాయి ప్రతిపాదనలను రూపొందించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులను మంజూరు చేయిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, కాలేజీ ప్రిన్సిపాల్ భారతి, టీఎస్ ఎంఐ డి సి డి ఈ అజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిసి సమ్మయ్య, ఈ ఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్, శానిటేషన్ డి ఈ దేవేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసిపి సుష్మిత, ఎలెక్ట్రికల్ ఏడిఈ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *