తాళ్లూరు తహసీల్దార్గా కె సంజీవ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్గా పనిచేస్తున్న సంజీవ రావు తహసీల్దార్ గా బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న నాగ లక్ష్మి జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్గా వెళ్లారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంజీవ రావు మాట్లాడుతూ ప్రాధాన్యతా క్రమంలో రెవిన్యూ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ఎదైనా సమస్యలతో వచ్చే ప్రజలు నేరుగా తనను సంప్రదించాలని దళారులను ఆశ్రయించ వద్దని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ కు డిప్యూటీ తహసిల్దార్ ఇమ్మానియేల్ రాజు , విఆర్వోలు, పలువురు ప్రజాప్రతినిధులు ,రాజకీయ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

