విద్య ద్వారానే కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, వారి అడుగుజాడల్లో నేటి యువత ముందుకు నడవాల్సిన అవసరం వుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
సోమవారం మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భముగా మరియు మైనారిటీల సంక్షేమ మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని సెయింట్ థెరిస్సా హైస్కూల్ ఆవరణము ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా, సమాజమైన అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యమౌతుందని విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యా రంగంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి శ్రీ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారని, వారి ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. అత్యంత శక్తి వంతమైన ఆయుధం విద్య అని అన్నారు. నేడు ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లా గా చెప్పబడుచున్నదని, జిల్లాలో అక్ష్యరస్యతా శాతం 62 శాతం మాత్రమేనని, దాన్ని 100 శాతం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంతో పాటు తమ పిల్లలను కచ్చితంగా డిగ్రీ వరకు చదివించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుచున్నవని, వాటిని అరికట్టాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా జిల్లా యంత్రాంగం బాలికల విద్య పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుచున్నదన్నారు. బాల్య వివాహాల రహిత ప్రకాశం జిల్లా లక్ష్యంతో విద్యకు అత్యంత ప్రాధ్యాన్యత ఇస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయడం జరుగుచున్నదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మేరుగుపర్చేలా విద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్య రంగ అభివృద్దికి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను డిగ్రీ వరకు చదివించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ …..11 సంవత్సరాల పాటు విద్యా శాఖా మంత్రిగా పనిచేసి విద్యారంగ అభివృద్ధి కి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ని, వారి జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారి సూచనలు, ఆశయాలను నేరవేర్చేలా ప్రతి ఒక్కరూ వారు అడుగుజాడల్లో నడవాలన్నారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ…. భారత స్వాత్రంత్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచిన గొప్ప వ్యక్తి జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విద్యా శాఖామంత్రి గా పదవి చేపట్టిన తరువాత, మనిషి తలరాతను మార్చే శక్తి విద్య వల్లనే సాధ్యమౌతుందని భావించి విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అన్నారు. వారి కృషిని, ఔనత్యాన్ని భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కపిల్ భాషా, అనీప్ ఖాన్, షేక్ సైదా, ఖలీల్ తుల్లా భాషా, గౌస్, పాదర్ పాల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భముగా మరియు మైనారిటీల సంక్షేమ మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన బండ్లమిట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ఉర్దూ పాఠశాల విద్యార్ధులకు ఈ సందర్భంగా ప్రైజ్ లను అందచేసారు.
ఈ సందర్భంగా ఆర్ టి సి లో పనిచేస్తూ మైనారిటీల అబివృద్దికి కృషి చేసిన ఎస్.కె సర్దార్ ని, ఉర్దూ గ్రేడ్ -1 పండిట్ శ్రీ మహబూబ్ జాన్ ను సన్మానించారు.
తొలుత శ్రీ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని పాత మార్కెట్ సెంటర్, సెయింట్ థెరిస్సా చర్చి ఎదురుగా వున్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, బిసి వెల్ఫేర్ అధికారి అంజల, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి నారాయణ, ఒంగోలు మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, మైనారిటీ నాయకులు, ప్రజలు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.







