జి జి హెచ్ లో బ్యాటరీ వాహనాలు పనిచేసేలా తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిజి హెచ్ సూపరిండెంట్ డాక్టర్ టి జమున కు హామీ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జమున ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సోమవారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బ్యాటరీ వెహికల్స్ విషయం ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా వాటిని మరమ్మత్తులు చేయిస్తామని లేకుండా నూతన వాహనాలకు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. తగిన చర్యలు తీసుకుకోవాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

