భారతరత్న అవార్డు గ్రహీత, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి జనాబ్ మౌలానా అభుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగారాష్ట్ర అసంఘటిత కార్మికుల చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ…జనాబ్ మౌలానా అభుల్ కలాం ఆజాద్..
విద్యావ్యవస్థలో సామాజిక మార్పులకు నాంది పలికిన విద్య స్ఫూర్తిదాత,, ఆధునిక భారత విద్యా విధానంలో అనేక విద్యా సంస్థలలో తీసుకొచ్చిన గొప్ప సంస్కర్త, భారతీయులందరికీ ఉచిత విద్యనివ్వాలి అనేటటువంటి ఆలోచనను ఆనాడే ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు,, దేశ స్వాతంత్ర పోరాటంలో 10 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన గొప్ప స్వాతంత్ర సేనాని,,, శ్రీ మహాత్మా గాంధీ , పండిత్ జవహర్ లాల్ నెహ్రూ తో కలిసి,, ఖిలాఫత్, క్విట్ ఇండియా, స్వపరిపాలన, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో,, అగ్ర బాగానే ఉండి,ఈ భారత జాతిని నడిపించిన గొప్ప ఉద్యమకారుడు,, కవిగా రచయితగా జర్నలిస్టుగా భారతీయులందరిలో పోరాట భావాలు నింపినటువంటి గొప్ప నాయకుడి యొక్క పోరాట స్ఫూర్తిని, స్మరించుకుంటు న్నామని అన్నారు. వారి యొక్క ఆలోచనలు యావత్ భారత జాతి మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని వారికి ఘనమైన నివాళులర్పించారు.
