బాల్య వివాహాలు నివారించి ప్రతి ఒక్కరి బాల్యం బంగారుమయం అయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

జిల్లాలో బాల్య వివాహాలు నివారించి ప్రతి ఒక్కరి బాల్యం బంగారుమయం అయ్యేలాసంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ముందుగా డివిజన్ల వారీగా
యర్రగొండపాలెం, కనిగిరి, కొండపి మండలాలను ఎంపిక చేసి వాటిలోని అన్ని గ్రామాలను చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ గా మార్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆమె అధ్యక్షతన “బంగారుబాల్యం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ” సమావేశం జరిగింది. ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్య వివాహాల నివారణ, బాలల హక్కులు వారి రక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వం కల్పిస్తున్న పధకాలు వాటిని పొందేందుకు ఉన్న అవకాశాలుతదితర అంశాలపై వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాలలో సంబంధిత శాఖలన్నీ భాగస్వాములై సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఇక పై ప్రతి నెలా మొదటి శుక్రవారం గ్రామస్థాయిలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం డివిజన్ స్థాయిలో, నాలుగో శుక్రవారం జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మిషన్ శక్తి పధకంలో భాగంగా సంబంధిత శాఖలన్నీ బాలల సర్వతోముఖాభివృద్ధిపైనా దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కలెక్టరేట్లో జిల్లా స్థాయి రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలు, అనారోగ్య సమస్యలు, బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించి ప్రతి ఒక్కరినీ ఆదుకునేలా వ్యక్తిగతంగా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ప్రతి బిడ్డనూ తమ స్వంత బిడ్డలా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది భావించి వారి సర్వతోముఖాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
డి.ఎల్.ఎస్.ఏ. సెక్రటరీ శ్యాంబాబు మాట్లాడుతూ బాలల హక్కులకు ఉన్న చట్టాలను ఈ సందర్భంగా వివరించారు. ప్యానల్ అడ్వొకేట్లు, పారా లీగల్ వాలంటీర్ల సేవలను కూడా బాల్య వివాహాల నివారణ కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. బి.చినఓబులేసు, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురి, బాలలసంక్షేమ కమిటీ ఛైర్ పర్సన్ వి.రామాంజనేయులు, మెప్మా పి.డి. రవికుమార్, డి.ఆర్.డి.ఏ.
పి.డి. వసుంధర, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కనకదుర్గ, జిల్లా బి.సి. సంక్షేమ అధికారిఅంజల, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు,మైనార్టీ సంక్షేమ అధికారి నారాయణ, దివ్యాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు అర్చన,బి.సి. కార్పొరేషన్ ఇ.డి. వెంకటేశ్వరరావు, జడ్పీ సి.ఈ.ఓ. చిరంజీవి, డి.ఎం. హెచ్.ఓ. సురేష్
కుమార్, డి.ఈ.ఓ. కిరణ్ కుమార్, డిప్యూటీ డి.ఈ.ఓ. సామా సుబ్బరావు, డి.సి.పి.ఓ. దినేష్ కుమార్, ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, సార్డ్స్, బచ్పన్ బచావో ఆందోళన్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *