తిరుమల గిరి లో అక్రమ నిర్మాణం పై ఎమ్మెల్యేకి పిర్యాదు………………….

తిరుమలగిరి మలాని ఎన్ క్లేవ్ శ్రీ బాలాజీ రెసిడెన్సి అపార్ట్మెంట్ లో స్టిల్ట్ ఫ్లోర్ సెల్లర్ లో అక్రమంగా నిర్మించిన రెండు గదుల నిర్మాణాన్ని తొలగించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు బాలాజీ రెసిడెన్సి ప్లాట్ యజమానులు మధుసూదన్, సతీష్, రాకేష్ లు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు, స్టీల్ట్ ఫ్లోర్ సెల్లార్ లో ఉన్న రెండు గదుల నిర్మాణం కిరాయికి ఇవ్వడం వల్ల, ప్లాట్స్ ఓనర్స్ కి సరైన పార్కింగ్ స్థలం సరిపోకపోవడంతో,పార్కింగ్ సమస్య ఏర్పడుతుందన్నారు. , ఈ నిర్మాణం వల్ల పార్కింగ్ సమస్య తలెత్తి ప్రతిరోజు ఫ్లాట్ ఓనర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి, దీనిపై యజమానులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పలుమార్ల ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని, ఈ సమస్యపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సమస్యను వివరించగా శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో చర్చించి శ్రీ బాలాజీ రెసిడెన్సి ఓనర్స్ కి వున్న పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానని హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *