ట్రాన్స్ ఫార్మర్ లను పగలగొట్టి రాగి తీగలను దొంగతనం మరియు గంజాయి అమ్మే వ్యక్తులను ప్రకాశం జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. వివరాలలోనికి వెలితే .. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం .. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో తరుచుగా జరుగుతున్న ట్రాన్స్ఫరమ్స్ పగలగొట్టి అందులోనే రాగి తీగలను దొంగతనం చేస్తున్న దొంగలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినందున వారి ఉత్వరుల మేరకు దర్శి SDPO బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బంది కలసి త్రీవ ప్రయత్నాలు చేస్తుండగా ఈ రోజు శుక్రవారం త్రిపురాంతం సీఐ అస్సన్ మరియు వారి సిబ్బందితో కురిచేడు ఏరియాలో తిరుగుతుండగా రాబడిన సమాచారం మేరకు ఈ దినం ఉదయం 11.30 కురిచేడు రైల్వే స్టేషన్ సమీపంలో పై తెలిపిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారించగా వారి వద్ద 1.5 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకొని పూర్తి స్ధాయిలో విచారించగా వారు తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి మరియు కురిచేడు పోలీస్ స్టేషన్లో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ లను పగలగొట్టి అందులోని రాగి తీగను దొంగలించినట్లు ఒప్పుకున్నారు.ఆరు కేసులకు సంబందించిన సుమారు 16 KG ల రాగి తీగను స్వాధీనం చేసుకోవటం జరిగినది.
ఇందులో పోలా జాన్సన్ గతంలో 13 ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలా జాన్సన్ మరియు కుంచాల లింగేష్ లు మరికొంత మంది స్నేహితులు జల్సాలకు, జూదాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించటానికి దొంగతనాలను ఎంచుకున్నారు. ఆ క్రమములో పోలా జాన్సన్ మరియు కుంచాల లింగేష్ లు మరికొంత మందితో కలసి గతములో ప్రకాశం జిల్లా లోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ లను పగలగొట్టి అందులోని రాగి తీగను దొంగలించి ఉన్నారు. , వారు దొంగలించిన రాగి తీగను గురున్నాధం లాజర్ కు, మరికొంత మందికి అమ్మేవారు. ఈ ముగ్గురు ముద్దాయిలు బాగా స్నేహంగా కలసి మెలసి తిరుగుతూ ఉంటారు. అందువలన పోలా జాన్సన్ మిగతా ఇద్దరితో కలసి వినుకొండ రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని, దానిని దర్శి ఏరియాలలో అమ్ముకోవటానికి కురిచేడు రైల్వే స్టేషన్ నుండి ఊర్లోకి వస్తుండగా, సమాచారకులను ఏర్పరచుకుని త్రిపురాంతకం సిఐ గారు చాకచక్యంగా వారిని పట్టుకుని, వారి వద్ద నుండి సుమారు 1.5 Kg ల గంజాయిని మరియు సుమారు 16 KG ల రాగి తీగను స్వాధీనం చేసుకోవటం జరిగినది.
ట్రాన్సఫారంలు పగలగొట్టి రాగి వైరు దొంగిలించే వారిని పట్టుకోవటంలో మంచి కృషి చేసిన త్రిపురాంతకం సి . ఐ అసన్, తాళ్లూరు ఎస్సై మల్లికార్జున, ఏఎస్ఐ మోహన్ రావు, హెడ్ కానిస్టేబుల్ విగ్నేష్, కానిస్టేబుల్ నారాయణరెడ్డి లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం లో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, దర్శి సీఐ రామారావు, త్రిపురాంతకం సీఐ అస్సాన్, ఎస్సైలు మురళి, మల్లికార్జున మరియు సిబ్బంది పాల్గొన్నారు.


