వ్యాసరచన పోటీల విజేతకు ప్రథమ బహుమతిని అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -విద్యార్థులు ఉత్తమ చదువులతో ఉన్నత స్థానాలకు చేరుకోని సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలివాలి -ఎస్పీ ఏఆర్ దామోదర్

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతగా నిలిచిన పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.జి.బి.వి.(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) జూనియర్ కాలేజీలో చదువుతున్న బి.వెంకటమ్మకి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ నగదు బహుమతిని అందచేసినారు. విద్యార్థులకు”సైబర్ నేరాల నివారణలో యువత పాత్ర” అనే అంశంపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మొదటి విజేతగా నిలిచిన బి.వెంకటమ్మ ప్రథమ బహుమతికి రూ. 5 వేలు నగదు బహుకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ వ్యాసరచన పోటీలో బి.వెంకటమ్మ చాలా అద్భుతంగా రాసిందని కొనియాడారు. బి.వెంకటమ్మ యొక్క చదువు వివరాలు, కుటుంబ నేపథ్యం, అలవాట్లు మొదలైన అంశాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. కేవలం చదువే కాక, చదువుతోపాటు క్రీడలు, ఇతర మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకొని, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను చదువుతూ వారి స్ఫూర్తిని మనలో నింపుకొని భవిష్యత్తును బంగారు మయంగా మార్చుకోవాలని సూచించారు. పోలీసు అమరవీరులకు నివాళిగా, వారి త్యాగాలను యువతకు పరిచయం చేయడం కోసం చేపడుతున్న ప్రేరణాత్మక కార్యక్రమాల్లో వ్యాసరచన పోటీలు ఒకటి అన్నారు.

ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంయొక్క స్టాఫ్ నర్స్ బి విజయలక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *