జాతీయ తైక్వాండో పోటీల్లో పతకం సాధించిన క్రీడాకారిణిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి – జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

ఒంగోలులో గత సంవత్సరం డిసెంబరులో జరిగిన తైక్వాండో బ్లాక్ బెల్ట్ పోటీల్లో 1వ డాన్ బ్లాక్ బెల్ట్ విభాగంలో బంగారు పతాకాన్ని సాధించిన ఒంగోలుకు చెందిన షేక్ సమీరాను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ మాట్లాడుతూ .. … జాతీయ స్థాయిలో బంగారు పతాకాన్ని సాధించడం గర్వించదగ్గ విషయమని, భవిష్యత్తులో మరింత మంచి నైపుణ్యాన్ని కనబర్చి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని, కష్టపడి ఆడితే క్రీడల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడలతో పాటు విద్యలో రాణించాలని, కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడ ముఖ్యమేనని అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *