71 వ ఆంధ్ర అంతర్ జిల్లాల సీనియర్ కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ

సూదనగుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూదనగుంట కోటయ్య చౌదరి & ఆదిలక్ష్మి మెమోరియల్ 71 వ సీనియర్ అంతర్ జిల్లాల పురుషులు & మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ను ఈరోజు ఒంగోలులోని ప్రకాశం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ , ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఈ పోటీలు డిసెంబర్ 5 నుంచి 8 వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని శ్రీ సూదనగుంట కోటయ్య చౌదరి స్కూలు ప్రాంగణంలో ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో జరుగుతాయి.
ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ జిల్లాల నుండి 13 పురుషులు మరియు 13 మహిళల జట్లు పాల్గొననున్నాయి.
ఈ టోర్నీలో పాల్గొనే జట్లకి శ్రీ సూదనగుంట ఫౌండేషన్ వారు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కల్పించనున్నారు.
ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పురుషులు మరియు మహిళా క్రీడాకారులను జాతీయస్థాయిలో జరిగే ఆంధ్ర కబడ్డీ జట్టుకు ఎంపిక చేస్తారు.
అలాగే త్వరలో జరగనున్న తెలుగు కబడ్డీ ప్రీమియం లీగ్ కు కూడా ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *