టిడిపీ సభ్యత్వ నమోదు వేగవంతం చెయ్యాలని ఆపార్టీ దర్శినియోజక వర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి లతిత్ సాగర్ అన్నారు. తాళ్లూరు ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం మండల కార్యకర్తల, నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి లతిత్ సాగర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్లు పార్టీ సభ్వత్వం తీసుకున్న వారికి ఇనెన్స్ సదుపాయం కల్పించారని అన్నారు. ఎవైనా ఇబ్బందులు జరిగినట్లయితే ఆయా కుటుంబాలకు భీమా ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. కావున మండలంలోని ప్రతి గ్రామంలో వివరించి సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు ఎవైనా ఇబ్బందులు ఉంటే నాయకులు కూర్చిని మాట్లాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కడియాల రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, నాయకులు మానం రమేష్, శాగం కొండా రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సూరా రెడ్డి, షేక్ పెద కాలేషా వలి (బడే),గోపిరెడ్డి వెంకటేశ్వరెడ్డి ( చందన),
గొల్లపూడి వేణుబాబు, ఐ.శ్రీనివాసరెడ్డి, రాచకొండ వెంకట్రావు, రామకోటిరెడ్డి, హ సుమారెడ్డి, గాడిపర్తి లక్ష్మినారాయణ, కె.నరసింహారావు, జి రమణా రెడ్డి (సమర), రామ కోటి రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

