బాలల హక్కులను తెలియజేసి స్వేచ్చగా ఎదిగేలా చెయ్యాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు అన్నారు. స్థానిక ఎబీసీ హైస్కూల్లో శుక్రవారం బాలల వారోత్సవాల సందర్భంగా కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో బాలలు ర్యాలీ నిర్వహించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ బడికి రాక ముందు పిల్లలు ఎలాంటి స్వేచ్చలో వున్నారో దానికి కొనసాగిస్తూ అక్షరజ్ఞానం , శాస్త్రీయ దృక్పధం, ధృడ స్వభావం, అటు పోట్లను ఎదుర్కోనే మనస్తత్వం, నిజాయితీ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం, పరిసరాలను నిశితంగా పరిశీలించటం, త్యాగ గుణాన్ని ఎదుటి వారికి సహాయ పడే మనస్తత్వాన్ని నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాలది మాత్రమే అని అన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల హక్కుల్ని కాపాడే యంత్రాంగంలో ప్రధాన పాత్ర అని వివరించారు. చిన్నారులు వారి స్వేచ్ఛను ఉపయోగించుకుని ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించి ఉన్నత స్థితిని చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ కె . కాలేషా బాబు తెలుగు పండింట్ సుబ్బయ్య, ఎస్ఏ కొండల రావు, వెంకట రావు, వలి తదితరులు పాల్గొన్నారు.

