తాళ్లూరు మండలంలోని ఆలయాలలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకున్నది.
తాళ్లూరు, మాధవరం, గుంటి గంగా భవాని, గుంటి గంగా వద్ద గల శివాలయం, లక్కవరం, బొద్దికూర పాడు గంగా పార్వతి వర్థిని సమేత సోమేశ్వరాలయం, శివరామపురం మొగలి గుండాల వద్ద గల అగస్తేశ్వర ఆలయాలలో ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బొద్దికూరపాడులో లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళ్లూరులోని శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి, మాధవరం గ్రామంలోని నీల కంఠేశ్వరస్వామి, బొద్దికూరపాడు గంగాపార్వతీవర్ధనీ సమేత సోమేశ్వరస్వామి, లక్కవరంలోని క్రిష్ణస్వామి ఆశ్రమంవద్ద గల శివాలయంలో, శివరాంపురం సమీ పానగల అగస్తేశ్వరస్వామి, తూర్పుగంగవరం వాసవి మాత ఆలయం వద్ద, తాళ్లూరు లోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో, గుంటిగంగలోని శివాలయం వద్ద మహిళలు కార్తీకవత్తులు వెలిగించారు. భక్తులుఅధిక సంఖ్యలో ఆలయాలకు తరలివెళ్లటంతో భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ఆలయాల పూజారులకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.








