మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు
తాడేపల్లిలో కలిసారు. దర్శి నియోజక వర్గ పరిస్థితులను తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని బాధ్యతలు చేపట్టంతో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషిని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మా నంద రెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.


