రబీలో సాగు చేసిన పైర్లకు ఈ – పంట నమోదు చేసుకోవాలని వ్యయసాయాధికారి ప్రసాద రావు కోరారు. ఈనెల 18 నుండి ఈ- పంట నమోదు జరగనున్నట్లు తెలిపారు. రైతులు తమ ఆధార్, పొలం పాస్ బుక్, మెబైల్ నంబర్లను రైతు సేవా కేంద్రాల వద్దకు తీసుకువెళ్లి ఈ- పంట నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ అందిస్తున్న పలు సబ్సీడీలకు ఈ- పంట నమోదు ఆధారమని తెలిపారు.
