పొన్నలూరుమండలం, సంగమేశ్వరం వద్ద నూతనంగా ఇరిగేషన్ ప్రాజెక్టు ను నిర్మించేందుకు నిర్దేశించిన ప్రతిపాదిత ప్రదేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రాజెక్టు కు సంబంధించిన మ్యాప్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తీ నివేదికను అందచేయాలని జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్స్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డిఈ కరిముల్లా, తహశీల్దార్ పుల్లారావు, ఎంపిడిఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.

