కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్ న్యూరో సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. వివరాలోనికి వెలితే…
నిజామాబాద్ కు చెందిన 30 సంవత్సరాల యువకుడికి మెదడులో ఉన్న రక్తనాళాల కనితిని నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్ న్యూరో సర్జరీతో పేషెంట్ స్పృహలో ఉండగానే అతనితో మాట్లాడుతూ, అతనికి ఇష్టమైన సినిమాను ట్యాబ్ లో చూపిస్తూ రెండు గంటల్లో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
గత కొన్ని సంవత్సరాలుగా బహరేన్ కు( అరబ్ కంట్రీ)కి వెళ్లిన సి.బి ప్రతిప్ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. గత రెండు నెలలుగా ఫిట్స్ తరచుగా రావడంతో అక్కడే హాస్పిటల్ లో కొద్ది రోజులు చికిత్స తీసుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో నగరానికి విచ్చేసి బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో న్యూరోసర్జన్లు డాక్టర్ వేణుగోపాల్ గోక మరియు డాక్టర్ మోహన శశాంక్ నేతృత్వంలో ఫంక్షనల్ ఎమ్మారై మరియు డిప్యూషన్ టెన్స్ ర్ ఇమేజింగ్ (DTI ) ల ఆధారంగా మెదడులో ఎడమవైపు భాగంలో ట్యూమర్ ఉన్నట్టు గుర్తించారు కణితి చుట్టూ ఉన్న నరాలు మాట్లాడేందుకు, అర్థం చేసుకోవడానికి సంకేతాలు పంపే నరాలు కావడంతో రోగికి శస్త్ర చికిత్సను నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్ న్యూరో సర్జరీ పద్ధతిలో చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్స సమయంలో రోగిని మెలకువగానే ఉంచి అతనితో మాట్లాడుతూ, కొన్ని వస్తువులు జంతువుల ఫోటోలను చూపిస్తూ వాటి పేర్లు ఇతరత్రా విషయాలను గుర్తించడంతోపాటు అర్థం చేసుకుంటున్నాడా లేదా అని పరీక్షిస్తూ రెండు గంటలలో రోగికి శాస్త్ర చికిత్స చేసి మెదడులో ఉన్న హ్యూమర్ను తొలగించారు. శస్త్ర చికిత్స సమయంలో రోగికి అవసరమైన మేర అనస్తీషియాను అందజేస్తూ అనసియాలజిస్ట్ డాక్టర్ అనఘ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ శస్త్ర చికిత్సను రెండు గంటల్లో పూర్తి చేశారు.
శస్త్ర చికిత్స అనంతరం శుక్రవారం రోగిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ సి ఓ ఓ డాక్టర్ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ ఆధునికి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్ల సేవలు అందుబాటులో ఉండడం వల్లే ఇలాంటి అరుదైన శాస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. 24/7 అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్ళిన తాను అనారోగ్యంతో ఇక్కడికి వచ్చి రోజుల వ్యవధిలోనే పూర్తిగా కోరుకున్నందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
