తాళ్లూరు- ముండ్లమూరు ఆర్ అండ్ బి రోడ్ లో తాళ్లూరు పడమటి బజారు నుండి సైడు కాలువలను ఎంపీడీఓ సుందర రామయ్య ఆదేశాలతో గ్రామ కార్యదర్శి ఐ రమణా రెడ్డి, సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ సమక్షంలో ప్రొక్లయిన్తో క్లియర్ చేయించారు. కాలువలు పూడి పోయి పూర్తిగా ఆర్ అండ్ బి రోడ్లో నీరు వస్తుండటంతో వాహనదారులకు బాగా ఇబ్బందికరంగా మారింది. రోడ్ సైతం గుంతల మయం కావటంతో గమనించిన అధికారులు తక్షణమే స్పందించి బాగు చేయించారు. నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
