బాలల హక్కులు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. బంగారు బాల్యం వారోత్సవాలలో బాగంగా శనివారం వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక పోటీలు నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ‘ మనం మన కోసం ‘ అనే అంశంపై వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి, ఎంఈఓ -2 సుధాకర్ రావు, ప్రధానోపాధ్యాయులు శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు. వెలుగు వారు పాలెం ప్రాథమిక పాఠశాల ( ఏ ఏ) వారోత్సవానికి కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి అంగన్వాడి టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.






