బాల్య వివాహాలు బంగారు భవిష్యత్కు ఆటంకం అని జన శిక్షణ సంస్థాన్ ప్రొగ్రాం ఆఫీసర్ కె. శ్యాం సునీల్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు అధ్యక్షతన లక్కవరంలో సమావేశం నిర్వహించారు. వేల్ఫేర్ అసిస్టెంట్ సాధన, మహిళా పోలీస్ కోటేశ్వరి తదితరులు బాలల హక్కుల పై అవగాహన కల్పించారు.

