శ్రీ హర్షిణి కళాశాలలో దేవకీ నందన వాసుదేవ మూవీ టీం సందడి చేసింది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ మరియు ఎక్స్ మిస్ ఇండియా మానసా వారణాసి హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న దేవకి నందన వాసుదేవా సినిమా ప్రమోషన్ లలో భాగంగా మూవీ టీం ఒంగోలులోని శ్రీ హర్షిణి కళాశాలలో సందడి చేసింది. శ్రీ హర్షిణి కళాశాలల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పూర్వ విద్యార్థులలో ఒకరు బాలకృష్ణ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా మరో విద్యార్థి ఈశ్వర్ దత్ దేవకి నందన వాసుదేవ సినిమాకు గాయకునిగా చేస్తున్నారు. గోరంట్ల రవికుమార్ పూర్వ విద్యార్థులలో ఒకరు నిర్మాతగా మరొకరు సింగర్ గా చేస్తూ సినిమా ప్రమోషన్ కు శ్రీ హర్షిణి కళాశాలకు రావడంతో కళాశాల యాజమాన్యం సినీ హీరో హీరోయిన్ లతో పాటు నిర్మాత సింగర్ లకు ఘన స్వాగతం పలికింది. వేలాదిమంది విద్యార్థుల నడుమ కళాశాలలో దేవకి నందన వాసుదేవ టీం సందడి చేసింది. మూవీ టీం చేసిన సందడి వాతావరణంతో శ్రీ హర్షిణి విద్యార్థిని విద్యార్థుల కేరింతలతో కళాశాల ప్రాంగణం ఉర్రూతలూగింది. ఈనెల 22న దేవకి నందన వాసుదేవ సినిమా రిలీజ్ కానున్నట్లు వారు తెలియజేయగా శ్రీ హర్షిణి విద్య సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు మూవీ టీంకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. మూవీ ప్రమోషన్ కు వచ్చిన తమకు ఘన స్వాగతం పలికారంటూ మూవీ టీం శ్రీ హర్షిణి కు ధన్యవాదాలు తెలిపింది.





