వరుస బైక్ దొంగతనాలు మరియు గంజాయి అమ్మకమునకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.

ఒంగోలు పట్టణంలో మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తున్న వారిపై పోలీస్ వారు నిఘా ఉంచి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు మరియు వారి సిబ్బందితో కలసి CSR శర్మ కాలేజి జంక్షన్ దగ్గర 3 వ్యక్తుల కదలికలను గురించి సమాచారం అందగా సిబ్బంది అందరు పై ప్రదేశానికి చేరుకున్నారు. అంతట పోలిస్ వారిని చూసి వారు పారిపోవటానికి ప్రయత్నించగా అంతటా పోలీసువారు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా వారి వద్ద 4 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకొని పూర్తి స్ధాయిలో విచారించగా వారు 33 మోటార్ సైకిల్ లు దొంగతనము చేసినట్లు మధ్యవర్తుల సమక్షంలో అంగీకరించినారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తేది 15.11.2024 17.30 గంటలకు ఒంగోలు పట్టణం లోని CSR శర్మ కాలేజి జంక్షన్ వద్ద A1 అయిన కుంచాల శివప్రసాద్ ను, A2-ఉప్పు శ్రీకాంత్ ను మరియు A3 అయిన సహౌద్దీన్ సర్దార్ నిందితులను ప్రత్యేక బృందం అరెస్టు చేసి పైన పేర్కొన్న విధంగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

అభినందన: ద్విచక్రవాహనాల దొంగతనం కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా ఛేదించాలనే పట్టుదలతో కృషి చేసిన ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు , ఒంగోలు వన్ టౌన్ సిఐ వై. నాగరాజు, ASI K.సురేష్, ASI షేక్ నాయబ్ రసూల్, HC M.సాయి, HC జి.విజయ కుమార్, కానిస్టేబులు M.అనిల్ లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస ప్రతాలను మరియు రివార్డ్ లను ప్రకటించారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *