ఒంగోలు నగర పాలక సంస్థ అద్వ్యర్యంలో NCAP నిధులతో చేప్పట్టబోవుచున్న అభివృద్ది పనుల ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాఒంగోలు నగర పాలక సంస్థ కమీషనర్ మరియు ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా, సుమారు 4 కోట్ల రూపాయలతో ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో NCAP గైడ్లైన్స్ ప్రకారం అనుసరించి అభివ్రిద్ది పనులకు ప్రణాళిక తయారు చేయడం జరిగింది అని, ఈ పనులలో భాగంగా ఓల్డ్ బైపాస్ రోడ్ నందు డివైడర్ నిర్మించి వాటిలో మొక్కలు నాటే కార్యక్రమం, భాగ్యనగర్ 4 వ లైన్ లో నూతన రోడ్ నిర్మాణ పనులు, కిమ్స్ హాస్పిటల్ దగ్గర గ్రీనరీ అభివ్రిద్ది పనులు మరియు దిబ్బలరోడ్డు నందు గల దామచర్ల జనార్ధనరావు పార్క్ నందు చేయబోవు అభివృద్ది పనులు చేప్పట్టడం జరిగింది అని కమీషనర్ గౌరవ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా తో పాటు ఒంగోలు నగర పాలక సంస్థ కమీషనర్ డాక్టర్ కే. వెంకటేశ్వర రావు , నగర పాలక సంస్థ ME చంద్రయ్య , DEE పద్మజ, ఇసాయ్య అనిల్ కుమార్ లు, AE లు, RTO గారు ఇతర నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

