బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం
లో చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపం లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేవల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా శనివారం ప్రారంభిం చారు. సర్వదీక్ష మాలలు ధరించిన భక్తులందరికీ వారి దీక్ష పూర్తయ్యేంత వరకు కల్యాణ మండపం లో అన్నదానం చేయనున్నట్లు వారు తెలిపారు. గత 23 సంవత్సరాలుగా బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామి మాలలు ధరించిన భక్తులందరికీ అన్నదానం చేయడం ఆనవాయి తీగా వస్తోందన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారం భించామన్నారు. తొలుత బూచేపల్లి శివప్రసాద
రెడ్డి రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్పస్వామి మాల ధరించారు. అనంతరం అయ్యప్పస్వామికి వూజలు వేశారు. కార్యక్రమంలో బూచేపల్లి
కుటుంబ సభ్యులతో పాటు భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కన్నుల పండుగ పడిపూజ కార్యక్రమం….
బి వి ఎస్ ఆర్ నిలయం వద్ద శనివారం రాత్రి పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప… మాలధారణం నియమాల తోరణం… అంటూ భక్తి పాటలు పాడుతూ స్వాములు భక్తి పరవశ్యంలో ఆలరించారు. అధిక సంఖ్యలో స్వాములు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దంపతులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ….స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు.











