సమాజ సంక్షేమ ,అభివృద్ధిలో వారధిగా జర్నలిస్టు కీలక పాత్ర ఎపియూడబ్యుజె రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు

  • ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహణ కుష్టు వైద్యశాలలో రోగులకు దుప్పట్లు. టవల్స్ పంపిణీ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ

సమాజ సంక్షేమ , అభివృద్ధిలో వారధిగా జర్నలిస్ట్ లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎపీయూడబ్యుజె రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు పేర్కోన్నారు. జాతీయ పత్రికా దినోత్సవంను పురష్కరించుకుని శనివారం జిల్లా కుష్టు నివారణ కేంద్రం, వైద్యశాలలో రోగులకు దుప్పట్లు, టవల్స్ పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎపీయూడబ్యుజ్ అధ్యక్షుడు ఐవీ సుబ్బా రావు మాట్లాడుతూ…. జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఎపీయూడబ్యుజె సుదీర్ఘ పోరాటల చేస్తుందని, ఐజేయూ గుర్తింపు కలిగి ఉండి నిత్యం అనేక పోరాటాలు చేసి జర్నలిస్ట్ల సమస్యక పరిష్కారం చూపుతుందని అంటున్నారు. నిత్యం జర్నలిస్ట్లు జీవన పోరాటంలో పత్రికా యాజమాన్యాలు వేజ్ బోర్డు ఆదేశాలను అమలు చేయక పోవటంతో కనీసం జీత భత్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. గత ప్రభుత్వంలో వివక్షతో కనీసం ఎక్రిడేషన్ కార్డులు కూడ మంజూరు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కోన్న విషయాలను గుర్తు చేసారు. ప్రస్తుతం జనవరి నాటికి నూతన అక్రిడేషన్ కార్డులు అర్హలైన ప్రతి ఒక్కరికి మంజూరు చేసే విధంగా ప్రభుత్వం, సమాచార శాఖా మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నివాస స్థలాల మంజూరుకు కూడ ప్రయత్నించి ప్రతి జర్నలిస్ట్ ల కు నివాసం ఉండేలా కృషి చేస్తామని అన్నారు. అనంతరం రోగులకు దుప్పట్లు, టవల్స్, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు అలుగును సురేష్, జిల్లా కార్యదర్శి డి. కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి వెంకట రావు, శంకర్, ఐజియూ కౌల్సిల్ సభ్యులు శ్రీనివాస రావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళి, జిల్లా నాయకులు శ్రీనివాస రావు, కోటి రెడ్డి, జయరాం, ఆంధ్ర ప్రభ బ్యూరో భాస్కర్ రెడ్డి మెనేజర్ అశోక్, బేతాల శ్రీనివాస రావు, సర్వేశ్వర రావు, వైద్యురాలు డాక్టర్ కాండ్రగడ్డ రజిత మానస, ఎల్.టి క్రిష్ణ లీల సుజాత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, పీజీ కోర్సులో మిగిలిపోయిన సీట్లను ఈ నెల 15 నుండి స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి. సోమశేఖర తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 15 నుండి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. అడ్మిషన్ పొందే విద్యార్ధులు అదే రోజున కోర్సు ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.కోర్సుల వివరాలు :ఎం.ఏ. హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎం.ఏ. సోషల్ వర్క్, ఎం. కామ్, ఎమ్మెస్సీ మేథమేటిక్స్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ ఆక్వా కల్చర్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎం.ఏడ్, బి.పి.ఎడ్ & ఎం.పి.ఎడ్ కోర్సులలో అడ్మిషన్స్ కోరు విద్యార్ధులు గమనించగలరు.వివరాల కొరకుContact Mobile Numbers 8341935856, 6304343448
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *