ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, పీజీ కోర్సులో మిగిలిపోయిన సీట్లను ఈ నెల 15 నుండి స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి. సోమశేఖర తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 15 నుండి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. అడ్మిషన్ పొందే విద్యార్ధులు అదే రోజున కోర్సు ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.కోర్సుల వివరాలు :ఎం.ఏ. హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎం.ఏ. సోషల్ వర్క్, ఎం. కామ్, ఎమ్మెస్సీ మేథమేటిక్స్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ ఆక్వా కల్చర్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎం.ఏడ్, బి.పి.ఎడ్ & ఎం.పి.ఎడ్ కోర్సులలో అడ్మిషన్స్ కోరు విద్యార్ధులు గమనించగలరు.వివరాల కొరకుContact Mobile Numbers 8341935856, 6304343448
17
Nov