మాజీ ఎమ్మెల్యే, సీఎం తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడిని తాళ్లూరు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు ఆదివారం ఘన నివాళులు అర్పించారు. స్థానిక ఎన్ టి ఆర్ భవన్ లో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, నాయకులు తూము శివ నాగి రెడ్డి, రామయ్య, వేణుబాబు, లక్ష్మి నారాయణ, దాసు, పాలెం అంజి రెడ్డి, నాదేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
