విద్యార్థుల హుక్కలు కాపాడటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండ పల్లి ఆంజనేయులు అన్నారు. బంగారు బాల్యం కార్యక్రమంలో బాగంగా ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల రక్షణ, నివాసం, బస, భోజనం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు. పోషక పదార్ధాలు తీసుకునే హక్కు, ఆరోగ్యం పొందే హక్కు, లైంగిక వేదింపుల నుండి రక్షన సమాజం బాధ్యత అని చెప్పారు. విద్యార్థుల హక్కులను, బాధ్యతల తెలియజేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందని అన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు .
