రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో యూటర్న్ తగదని దర్శి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పుట్లూరు కొండారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లలో ప్రోగ్రాం తీసుకురావడం చాలా దురదృష్టకరం అని తెలిపారు. గతంలో మీరు టి.డి. పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారి పక్షం వారు …ఇదే స్మార్ట్ మెటల్ బిగిస్తుంటే ఇది కరెక్ట్ కాదు అని హైకోర్టుకు ఆశ్రయించిన సంగతి మీరు మరిచారా అని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నామని అన్నారు. రైతులు మీటర్లు బిగిస్తే వ్యతిరేకించాలని…. ఈ మీటర్ల ద్వారా అధిక బిల్లులు వసూలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన మాటలు మరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేయటం ఏమిటని… దర్శి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నిస్తూ ఇలా చేయవద్దని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న విధానమేమిటి మీరు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి మరి వారి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతులు బోరు బావులకి అలాగే…. గృహాలకి… వ్యాపారస్తులకి… ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని…. ఇప్పుడు మీరు చేస్తున్న విధానం కరెక్టేనా ఒక్కసారి మీ మనస్సాక్షిగా పరిశీలించమని తెలియజేస్తున్నామని అన్నారు. మరి ఇదే రకంగా మీరు గాని రైతుల దగ్గర ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని… మీరు బిగించిన మీటర్లు వ్యతిరేకిస్తున్నామని…రైతులు కూడా వ్యతిరేకించమని కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటదని ….తెలియజేస్తూ ఇదే విధంగా కొనసాగిస్తే ధర్నా కార్యక్రమంలో నిరసన కార్యక్రమం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని దర్శి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పుట్లూరు కొండారెడ్డి హెచ్చరించారు.
