జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రెండు రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం సాయంత్రం ముగింపు వేడుకల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. గత రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహించిన అన్ని క్రీడా పోటీలు కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. పురుషులకు నిర్వహించిన 100 మీటర్ల ఫైనల్ పరుగును జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నాలుగు పోలీస్ సబ్ డివిజన్ల మరియు ఆర్మే డ్ రిజర్వ్ నుండి పాల్గొన్న పోలీసు క్రీడాకారులు క్లోసింగ్ మార్చ్ చేసి ముఖ్య అతిధులకు గౌరవ వందనం చేసారు. స్పోర్ట్స్ మీట్ లో విజేతలగా నిలిచిన జట్టులకు మరియు ఇతర విజేతలను ఎస్పీ గారు ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు మరియు సర్టిఫికెట్స్ అందచేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కు ప్రతీకగా సూచించే పోలీస్ పతాకాన్ని ఎస్పీ గారికి క్రీడాకారులు అందించారు.
జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్
మాట్లాడుతూ…. జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 పండుగ వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయని సంతోషం వ్యక్తం చేశారు. క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి రోజు చురుగా విధులు నిర్వర్తించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసేలా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి క్రీడలు,వ్యాయామం ఒక భాగంగా ఉండాలని,ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఎదో ఒక వ్యాయామం గానీ, క్రీడను గానీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు. క్రీడలలో గెలుపోటములు సాధారణమని, క్రీడా స్పూర్తితో ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించినప్పుడే జీవితంలో కూడా ఒడిదుడుకులను ఎదుర్కోగలమని అన్నారు. పోలీస్ విధులు టీం వర్క్ లాగా ఉంటుందని, క్రీడల్లో అయినా, పోలీస్ విధుల్లోనైనా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించగలమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉండాలని మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలని సూచించారు. అందరూ శారీరక ఫిట్ నెస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
క్రికెట్ ఐటీ కోర్ టీం విజేతగా నిలిచింది.
కబడ్డీ లో డి.ఏ.ఆర్ జట్టు గెలుపొందింది.
వాలీ బాల్ లో డి.ఏ.ఆర్ జట్టు విజేతగా నిలిచింది.
పురుషుల అథ్లెటిక్స్ విభాగంలో DAR చెందిన కానిస్టేబుల్ ఐ.గురుస్వామి ఓవరాల్ ఛాంపియన్ గా (400 M,800M,1500M, లాంగ్ జంపు మరియు త్రిబుల్ జంప్ ప్రథమ విజేతగా నిలిచాడు.
ఈ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎస్పీ ఏఆర్ దామోదర్
మెమెంటోలను అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వరరావు, AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్బి డిఎస్పీ సురేష్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, సిఐ లు, RIలు, ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




