ఆంధ్ర ప్రదేశ్ ప్రవేట్ అన్ ఎయిడెడ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిండర్ గార్డెన్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహణ -కిండర్ గార్డెన్ పిల్లలతో పుస్తకాలు లేని బోధన

కిండర్ గార్డెన్ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 21 వశతాబ్ద నైపుణ్యాలను పెంపొందించే ” ఎడ్యు ఈజీ కాన్సెప్ట్’ ద్వార ఎలా బోధించాలి అనే అంశము మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రవేట్ అన్ ఎయిడెడ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏడుగుడ్ల పాడు లో ఉన్నా శ్రీ హర్షిణీ జూనియర్ కాలేజీ లో జరిగిన శ్రీ ప్రైమరి ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహంచారు. ఈ శిక్షణ తరగతులలో కిండర్ గార్డెన్ స్థాయి పిల్లలు పుస్తకాలు ఉపయోగించకుండా వినూత్న విధానాల ద్వార ఏ విధంగా విద్యా బోధిన చేయాలనే విషయం మీద విశాఖపట్నం ‘ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్సీ’ డైరక్టర్ మళ్ల రామునాయుడు చాలా సవివరంగా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. మరో ట్రైనర్ ప్రిన్సిపాల్ మల్లివాణి శ్రీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించిుకొని విద్యను బోధించి నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఇంగ్లీష్ అక్షరాలను, నంబర్లను సులభంగా ఏ విధంగా పిల్లలకు నేర్పించే విధానం
ప్రయోగాత్నకంగా ఉపాధ్యాయులకు తెలియ చేసారు. పిల్లలకు చిన్న తనం నుంచీ విద్యతో పాటు విలువలను కూడ నేర్పిచాలని తెలియ జేసారు. హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవి కుమార్ మాట్లాడుతూ ….అపుస్మా అసోసియేషన్ ఇటువంటి మంచి కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించి, ఉపాధ్యాయుల్లో మెలకువలను తీసుకురావడానికి ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో అపుస్మా అధ్యక్షలు కొల్లా మాధవ రావు, జిల్లా గౌరవాధ్యక్షలు బొడ్డు హనుమంతరావు, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.వి. సుబ్బారావు, ఎ. శ్రీనివాసరావు, సెక్రటరీ మల్లికార్జున రెడ్డి, జాయింట్ సెక్రెటరీ నాగేశ్వరరావు, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షులు నేతాజీ మల్లికార్జునరావు, సెక్రటరీ జపిటర్ వంశి, లక్షణ, తదితరులు పాల్గొన్నారు.ఈ శిక్షణ తరగతులకు ఘమారు 400 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరైనారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *