A.P.T.C.A ONGOLE UNIT SPORTS MEET -2024 బహుమతి ప్రధానోత్స కార్యక్రమం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆచార్య రంగా భవన్ నందు A.P T.C.A ONGOLE UNIT అధ్యక్షులు ములకా రామిరెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ విచ్చేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు కు ఏ అవసరం వచ్చినా నేను ముందుండి ఆ సమస్యను తీరుస్తారని అలానే నూతన కార్యవర్గం గా ఎన్నిక కాబడిన అధ్యక్షరాలు అయినా శ్రీమతి E.V.S లక్ష్మీ కార్యదర్శి K. శ్రీనివాసరావు కోశాధికారిగా జి శ్రీనివాసరావు ను అభినందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా జరిగిన వివిధ ఆటల పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవం శ్రీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో A.P.T.C.A రాష్ట్ర అధ్యక్షులు పి .ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ ప్రైవేట్ స్కూల్స్ చేసిన సేవలను కొనియాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్షిణి విద్యాసంస్థల అధినేత జి రవికుమార్ గారు, శ్రీ సరస్వతి విద్యాసంస్థల అధినేత ఏ.వి.రమణారెడ్డి గారు,A.P.T.C.A జిల్లా అధ్యక్షులు పిడుగు జాలి రెడ్డి ఒంగోలు మండల విద్యాశాఖాధికారి కిషోర్ బాబు ఆటల పోటీలలొ విజేతలైన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఆంధ్ర శ్రీను , నారాయణ స్కూల్ నారాయణ నిర్మల యేసు పాదం , ప్రజ్ఞ సుబ్బారావు, గీతాంజలి శ్రీనివాస రావు ,కేరళ సిబి మైఖేల్ మరి యు ఇతర కరస్పాండెంట్ విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.


