అమెజాన్ కంపెనీలో జరిగిన ప్రాంగణ ఎంపికలలో ఒంగోలు శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీ విద్యార్థి ఏ.హరి హర కుమార్ ముంబై అమెజాన్ కంపెనీలో 9 లక్షల ప్యాకేజీ తో ఎంపిక కాబడ్డాడు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ డిగ్రీ తో పాటు విద్యార్థులకు ఎనలటికల్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ హర్షిణి అని తెలియజేశారు.ఈ సంవత్సరం ఇప్పటివరకు 800 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డీన్ దాది ఆంజనేయులు, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి, ఏవో ర్యాంకర్స్ శ్రీనివాసరావు, క్యాంపస్ ఇంచార్జ్ ధిరీష్ మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.
ముంబై అమెజాన్ కంపెనీకి ‘ శ్రీ హర్షిణి ‘ విద్యార్థి ఎంపిక
18
Nov