తాళ్లూరు మండలం బొద్ధికూరపాడు చేపల చెరువు వేలంపాట కొలిక్కి రావడం లేదు. గత వారం రోజుల క్రితం నిర్వహించిన వేలంపాట వాయిదా పడగా, రెండోసారి వేలంపాట సోమవారం నిర్వహించారు. చేపల చెరువు వేలంపాటకు ప్రభుత్వ నిర్ణయ ధర 14 లక్షల 80 వేల రూపాయలు ఉండడంతో పాట దారులు ఎవరు ముందుకు రాలేదు. కేవలం నలుగురు మాత్రమే డిపాజిట్ దారులు ముందుకు రాగా ప్రభుత్వ నిర్ణయ ధరతో వారు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది. ఎవరూ వేలం పాట పాడకపోవడంతో మరోసారి చేపల చెరువు వేలం పాట వాయిదా పడింది. శుక్రవారం తిరిగి మూడోసారి పాట నిర్వహించబోతున్నట్లు ఎంపీడీవో సుందర రామయ్య తెలిపారు. సర్పంచ్ మందా శ్యామ్సన్, ఉప సర్పంచ్ పులి ప్రసాదరెడ్డి, గ్రామ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
