రోడ్డు ప్రమాదంలో ఇటీవల కాలంలో మైనర్లు యువకులు మృతి చెందటం
చాలా బాధాకరమని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అన్నారు. కొప్పొలు సమీపంలో ట్యాంకర్ ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన రేష్మన్, వికాస్, విశాల్ యువకుల కుబుంబాలను సోమవారం ఒంగోలు రిమ్స్ వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తల్లిదండ్రులు కూడ వారి బిడ్డలకు వాహనాలు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చెయ్యాలని పోలీసులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాస రావు, ఎస్ బి ఇన్స్ఫెక్టర్ కెవి రాఘ వేంద్ర, తాలూకా సీఐ అజయ్ కుమార్ ఎస్సైలు హరిబాబు, క్రిష్ణ పావనిలు ఉన్నారు.
