ఇందిరా గాంధీ జయంతిని జయప్రదం చెయ్యండి – దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త, అసంఘటిత కార్మికుల పార్టీ రాష్ట్ర చైర్మన్ కైపు వెంకట క్రిష్ణా రెడ్డి

ఇందిరా గాంధీ 107వ జయంతిని మంగళవారం దర్శి నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త, అసంఘటిత కార్మికుల పార్టీ రాష్ట్ర చైర్మన్ కైపు వెంకట క్రిష్ణా రెడ్డి తెలిపారు. దర్శి పట్టణంలో మూడు బొమ్మల సెంటర్లో మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. దేశ ప్రగతికి ఆపార కృషి చేసిన ఐరన్ లేడీగా పేరు గాంచిన ఇందిరా గాంధీని పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించాలని ఆయన కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *