రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఒంగోలు షాదీ ఖానా భవనంలో ఆదివారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పాఠశాలలో 8వ తరగతికి చెందిన ఎన్ సౌందర్య సిల్వర్ మెడల్, 6వ తరగతికి చెందిన షేక్ సైవుద్దీన్ బ్రాంజ్ మెడల్, 5వ తరగతికి చెందిన షేక్ మహిరా కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను సోమవారం పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు చిడిపోతు అరుణ కుమారి, తైక్వాడో కోచ్ షేక్ అభిముల్లా, ఉపాధ్యాయులు నాగి రెడ్డి, సీఆర్పీ బి శ్రీనివాస రావు, ఉపాధ్యాయులు అభినందించారు.

