బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరేలా చర్యల చేపట్టాలి – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 62 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించుటకు కొరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమంను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి వ్రాతపూర్వక పిర్యాదులు/వినతులను స్వీకరించి, వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని ఎస్పీ వారికి భరోసా కల్పించారు.

అందిన ఫిర్యాదులపై ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆయా ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పరిష్కారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ/ఆర్థిక తగాదాలు, కుటుంబ సమస్యలు, అత్తరింటి వేదింపులు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సీఐ N. శ్రీకాంత్ బాబు, S. కొండ సీఐ హాజరత్తయ్య, DCRB సీఐ దేవ ప్రభాకర్, ప్యానెల్ అడ్వొకేట్ బివి.శివరామకృష్ణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, ప్రభాకర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *