ఒంగోలు జీఎంసీలో జరిగిన అనస్థీషియా జోనల్ సీఎంఈ లో కేస్ స్టడీస్ ప్రజెంటేషన్ మరియు క్విజ్ పోటీలలో అనస్థీషియా పీజీ విద్యార్థులు డాక్టర్ శ్రావ్య , డాక్టర్ స్మతి, డాక్టర్ వినోద్ లు ప్రతిభ చాటారు. పోటీలలో ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థులను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడు కొండల రావు సోమవారం అభినందించారు. అనిస్థిషియా డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ రాజా సుందరం తదితరులు పాల్గొన్నారు.
