కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పెన్షన్ దారులకు రావలసిన బకాయిలు, రాయితీలు విడుదల చెయ్యాలని వక్తలు డిమాండ్ చేసారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆన్ పెన్షనర్స్ అండ రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన ఆధ్వర్యంలో పెన్షనర్ల విద్రోహ దినం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.
సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ ఈ పీఎఫ్ పెన్షన్ దారులకు ప్రతి నెల పెన్షన్ వెయ్యి నుండి మూడు వేలు మాత్రమే పొందుతున్నారని ఇది చాలా అమానుషమని అన్నారు. వీరికి కనీస పెన్షన్ రూ. 9వేలు డీఏతో కలిపి ప్రకటించాలని డిమాండ్ చేసారు. టివిఆర్ సుబ్బారావు, బివి రావు, ఎస్ సంపత్ రాఘవులు, నారాయణ రైతు సంఘనాయకులు చుండూరి రంగ రావు, సింగ రాజు శ్రీనివాసరావు. ఆంజనేయులు నరసింహారావు, నారాయణ, శ్రీరామ మూర్తి, జి నారాయణ లు పెన్షనర్ల పట్ల ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షను ఎండగట్టారు. ముందుగా సంఘ జిల్లా అధ్యక్షుడు జి శేషయ్య శిబిరాన్ని ప్రారంభించారు.
