తాళ్లూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో రీసర్వేలో జరిగిన తప్పులను దిద్దుబాటు చేశారు. స్థానిక గ్రామసచివాలయం వద్ద ఇటీవల రీసర్వే గ్రామసభల్లో వచ్చిన అర్జీదారులతో తహసీల్దార్ కె. సంజీవరావు ఆదేశంతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జాయింట్ పొలాల్లో హక్కుల్లో తప్పులు వున్న రైతులను పిలిపించి, క్షేత్రస్థాయిలో భూమి అనుభవాన్ని, రికార్డులను పరిశీలించి 6 గురు రైతుల సమస్యలను పరిష్కరించారు. ఈకార్యక్రమంలో గ్రామ విఆర్వో నాగూర్ బి , విలేజ్ సర్వేయర్లు రైతులు పాల్గొన్నారు.
